మోనాలిసాకు సినిమా ఆఫ‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు అరెస్ట్‌

  • మోనాలిసాకు ఆఫ‌ర్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు స‌నోజ్ మిశ్రా  
  • అత్యాచారం కేసులో అరెస్ట‌యిన వైనం
  • ఓ వర్ధమాన నటిపై ప‌లుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు
ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రిగిన మ‌హా కుంభమేళా ద్వారా రాత్రికి రాత్రే సోష‌ల్ మీడియా సెన్సేష‌న్ గా మారిన‌ మోనాలిసాకు తన చిత్రంలో ఆఫర్ ఇచ్చిన‌ దర్శకుడు స‌నోజ్ మిశ్రా సోమవారం అరెస్టు అయ్యారు. అత్యాచారం కేసులో ఢిల్లీ పోలీసులు ఆయ‌న‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. 

ఆయ‌న‌ ఒక చిన్న పట్టణానికి చెందిన ఒక వర్ధమాన నటిపై ప‌లుమార్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును సనోజ్ మిశ్రా ఆశ్రయించారు. కానీ, కోర్టు ఆయ‌న‌కు బెయిల్ తిరస్కరించ‌డంతో అరెస్టు జరిగిన‌ట్లు తెలుస్తోంది. 

కాగా, మోనాలిసాకు ఆయ‌న త‌న 'ది డైరీ ఆఫ్ మ‌ణిపుర్' చిత్రంలో హీరోయిన్‌గా తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు సనోజ్ మిశ్రా అరెస్టుతో ఈ ప్రాజెక్టు గంద‌ర‌గోళంలో ప‌డింది.


More Telugu News