సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరోపణలపై హెచ్సీఏ స్పందన

HCA Responds to Sunrisers Hyderabads Claims
  • ఉచిత టికెట్ల కోసం హెచ్సీఏ వేధిస్తోందన్న సన్ రైజర్స్ హైదరాబాద్
  • వేధింపులు కొనసాగితే హైదరాబాద్ ను వదిలి వెళ్లేందుకు సిద్ధమని సన్ రైజర్స్ చెప్పినట్టు వార్తలు
  • ఆ వార్తల్లో నిజంలేదన్న హెచ్సీఏ
ఉచిత టికెట్ల కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) వేధిస్తోందని ఆరోపించినట్టు... ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే హైదరాబాద్ విడిచి వెళ్లడానికి తమ ఫ్రాంఛైజీ సిద్ధంగా ఉందని సన్ రైజర్స్ హైదరాబాద్ స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై హెచ్సీఏ స్పందించింది. ఆ వార్తల్లో నిజం లేదని పేర్కొంటూ ఒక ప్రకటనను విడుదల చేసింది. తమకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలాంటి ఈమెయిల్స్ రాయలేదని తెలిపింది. 

ఒకవేళ నిజంగానే ఈమెయిల్స్ వచ్చి ఉంటే... ఈ సమాచారాన్ని హెచ్సీఏ లేదా సన్ రైజర్స్ అధికారిక ఈమెయిల్స్ నుంచి కాకుండా గుర్తు తెలియని ఈమెయిల్స్ నుంచి లీక్ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఈ ఈమెయిల్స్ నిజమైనవా? కాదా? అనే విషయం తెలుసుకోవడానికి తమ నుంచి కూడా మీడియా వివరణ తీసుకోవాలని సూచించింది. తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరింది.
Go Back to Shorts
Sunrisers Hyderabad
HCA
Hyderabad Cricket Association
IPL
Free Tickets
Allegations
Email Controversy
Cricket News
Indian Cricket
Hyderabad

More Telugu News