మయన్మార్‌లో మళ్లీ భూకంపం... పరుగులు తీసిన ప్రజలు
- భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదు
- శుక్రవారం నాటి భూకంపం కారణంగా 1600 మందికిపైగా మృతి
- బ్యాంకాక్‌లో గల్లంతైన 78 మంది జాడ కోసం గాలింపు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి రోడ్లు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడంతో సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంతో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నిన్న ఏకంగా మూడు భూకంపాలు మయన్మార్ ప్రజలను భయపెట్టాయి. ఉదయం 11.53 గంటలకు 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో, 20 నిమిషాల అనంతరం 4.7 తీవ్రతతో మరో భూకంపం ప్రజలను భయపెట్టింది.
శుక్రవారం నాటి భూకంపం కారణంగా థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో నిర్మాణంలో ఉన్న హైరైజ్ భవనం కుప్పకూలిన ఘటనలో అక్కడ పనిచేస్తున్న 78 కార్మికుల జాడ ఇంకా తెలియరాలేదు. నగరంలో చనిపోయిన మరో 10 మందిని నిన్న గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.