వైసీపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తాం: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి
- వివేకా హత్య గురించి అవినాశ్ రెడ్డికి అంతా తెలుసన్న ఆదినారాయణరెడ్డి
- జగన్ కుటుంబమంతా కేసుల్లో ఇరుక్కుపోయిందని విమర్శ
- వారు చేసిన పాపాలను తమపై నెట్టే ప్రయత్నం చేశారని మండిపాటు
ఎవరు చనిపోయినా జిల్లాకు రావడం, పరామర్శల పేరుతో రాజకీయాలు చేయడం జగన్ కు అలవాటయిందని ఆదినారాయణరెడ్డి విమర్శించారు. రెండు, మూడేళ్లలో ఎన్నికలు వస్తాయని, తాను మళ్లీ సీఎం అవుతానని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకి ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటు కూడా రాకుండా చేస్తామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ పెద్దదని అన్నారు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి కూడా రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని దుయ్యబట్టారు.