అమిత్ షాను కలవడానికి నాలుగు కార్లు మార్చారు: పళనిస్వామిపై స్టాలిన్ విమర్శలు
- ఇటీవల ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసిన పళనిస్వామి
- స్కాముల్లో చిక్కుకున్న వ్యక్తి మాదిరి అమిత్ షాను కలిశారన్న స్టాలిన్
- అసెంబ్లీకి పళనిస్వామి ఎందుకు రాలేదో అందరికీ తెలుసని వ్యాఖ్య
అసెంబ్లీ సమావేశాలకు పళనిస్వామి ఎందుకు హాజరు కాలేదో అందరికీ తెలుసని స్టాలిన్ చెప్పారు. తెల్లవారుజామున ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లి ఢిల్లీ విమానం ఎక్కారని తెలిపారు. స్కాముల్లో చిక్కుకున్న వ్యక్తి మాదిరి అమిత్ షాను కలవడానికి నాలుగు కార్లు మార్చారని చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలుస్తుందని పళనిస్వామి చెబుతున్నారని... కానీ, వారు ప్రతిపక్షానికే పరిమితమవుతారని చెప్పారు.