విమానంలో బీడీ తాగుతూ పట్టుబడ్డ ప్రయాణికుడు
- సూరత్ నుంచి కోల్‌కతా వెళుతున్న విమానంలో ఘటన
- సాంకేతిక సమస్యల కారణంగా ఫ్లైట్ టేకాఫ్ ఆలస్యం
- విమానంలోనే నిరీక్షిస్తున్న ప్రయాణికులు
- ఫ్లైట్ వాష్‌రూమ్ నుంచి పొగ, వాసన రావడంతో సిబ్బంది షాక్
- విమానాశ్రయ అధికారులకు సమాచారం
- వారి తనిఖీల్లో అశోక్ బిశ్వాస్ అనే వ్యక్తి బ్యాగ్‌లో దొరికిన బీడీలు, అగ్గిపెట్టె
ఈ క్రమంలో విమానం వాష్‌రూమ్ నుంచి పొగ, వాసన రావడంతో సిబ్బంది గమనించి ఎయిర్‌పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు సోదాలు నిర్వహించగా... బెంగాల్‌కు చెందిన అశోక్ బిశ్వాస్ అనే వ్యక్తి బ్యాగ్‌లో బీడీలు, అగ్గిపెట్టె దొరికాయి. అతడే వాష్‌రూమ్‌లో బీడీ తాగినట్లు నిర్ధారించుకున్న అధికారులు బిశ్వాస్‌ను విమానం నుంచి దింపేయడంతో పాటు పోలీసులకు అప్పగించారు. సెక్యూరిటీ అధికారుల కళ్లుగప్పి అతడు నిషేధిత వస్తువులను విమానంలోకి ఎలా తీసుకొచ్చాడనే విషయంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అతడిపై కేసు కూడా నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.