మయన్మార్ భూకంపం.. వేగంగా స్పందించిన భారత్
- 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపించిన ప్రభుత్వం
- ఆహార పదార్థాలు, అత్యవసర మందులు, టెంట్లతో బయల్దేరిన విమానం
- మరింత సాయం అందించేందుకు సిద్ధమని ప్రకటన
భారీ భవనాలు కూలిపోవడంతో గాయపడిన వారికి చికిత్స అందించడానికి అవసరమైన మందులను కూడా పంపించినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ విమానం శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మయన్మార్ లోని యాంగాన్ విమానాశ్రయంలో దిగిందని భారత దౌత్యవేత్త రణధీర్ జైశ్వాల్ ట్వీట్ చేశారు. మానవతా సహాయంగా ఈ విమానాన్ని పంపామని, అవసరాన్ని బట్టి మరింత సహాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు.