హెల్మెట్‌ను విసిరికొట్టిన నితీశ్ కుమార్ రెడ్డి.. నెట్టింట వీడియో వైరల్!
అయితే, సన్‌రైజర్స్ తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ చేసిన పని తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి నితీశ్ కుమార్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 28 బంతులాడి 32 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో ఔటైన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ హెల్మెట్‌ను ఆగ్రహంగా మెట్లపైకి విసిరికొట్టాడు. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.