విజయవాడలో ముస్లింలకు ఇఫ్తార్ విందు... హాజరైన సీఎం చంద్రబాబు
- కొనసాగుతున్న రంజాన్ మాసం
- విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో ముస్లింలకు ఇఫ్తార్ ఏర్పాటు చేసిన ఏపీ సర్కారు
- ముస్లింలతో కలిసి నమాజ్ చేసిన చంద్రబాబు
- ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని హామీ
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకువస్తామని భరోసా ఇచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడతామని హామీ ఇచ్చారు. పేదలతో నేనుండాలనేదే నా జీవితాశయం అని స్పష్టం చేశారు. పేదవాళ్లను పైకి తీసుకువచ్చేందుకే ఈ నెల 30న పీ4 అమలుకు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.


