చంద్రబాబు కాళ్లకు మొక్కిన జనసేన నేత జయమంగళ
- నేడు పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు
- చంద్రబాబును కలిసిన జనసేన నేత జయమంగళ
- 1999 నుంచి 2023 వరకు టీడీపీలో ఉన్న జయమంగళ
1999లో టీడీపీ ద్వారా జయమంగళ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో టీడీపీ తరపున కైకలూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2023 ఫిబ్రవరిలో వైసీపీలో చేరారు. 2023 మార్చిలో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందారు. 2024 నవంబర్ 23న వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి జయమంగళ చేసిన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ ఇంకా ఆమోదించకపోవడం గమనార్హం.