పెళ్లి కావడంలేదని సికింద్రాబాద్ లో యువ వైద్యుడి బలవన్మరణం
- రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న డాక్టర్
- ఇటీవలే నిశ్చితార్థం.. బట్టతల ఉందనే కారణంతో రద్దు
- తల్లిదండ్రులు సంబంధాలు వెతుకుతున్నా కుదరడంలేదని మనస్తాపం
అయితే, పురోహిత్ కు బట్టతల ఉండటం, ఇతర కారణాల వల్ల అమ్మాయి కుటుంబం ఈ వివాహాన్ని రద్దు చేసుకుంది. దీంతో పురోహిత్ తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతుకుతున్నారు. సరైన సంబంధం దొరకడం లేదు. ఇప్పటికే 34 ఏళ్లు వచ్చాయని, నిశ్చితార్థం అయ్యాక పెళ్లి రద్దయిందని పురోహిత్ మనస్తాపం చెందాడు. ఈ ఆవేదనతో బుధవారం ఉదయం బొల్లారం రైల్వేస్టేషన్ సమీపంలోని క్యావలరీ బ్యారక్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. లోకో పైలెట్ ఈ విషయాన్ని గుర్తించి జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించారు. గుర్తింపు కార్డులోని చిరునామా ఆధారంగా పురోహిత్ కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.