చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాపై కీలక అప్టేడ్

  • ఉగాది రోజున చిరు, అనిల్ రావిపూడి సినిమాకు పూజా కార్యక్రమం
  • జూన్ నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం
  • 2026 సంక్రాంతికి సినిమా విడుదలయ్యే అవకాశం
మెగాస్టార్ చిరంజీవి, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసింది. ఈ సినిమాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తెలుస్తోంది. ఈ వార్త మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేకకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

చిరు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం కామెడీ ఓరియెంటెడ్ గా ఉంటుందని... ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జూన్ నుంచి ప్రారంభంకానుందని, 2026 సంక్రాంతికి సినిమా విడుదల కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తుండగా... భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.  


More Telugu News

Chiranjeevi Anil Ravipudi Telugu Movie Upcoming Telugu Film Chiru Anil Ravipudi Movie Shine Screens Bheems Ceciroleo Comedy Movie Tollywood 2026 Sankranti Release