ముద్దాయికి పోలీసులతో సెల్యూట్ కొట్టిస్తారా?: జగన్ వ్యాఖ్యలపై వర్ల రామయ్య ఫైర్
- వివేకా హత్య కేసు నిందితుడు సునీల్ యాదవ్ ఫిర్యాదు
- పవన్ కుమార్ అనే వైసీపీ మద్దతుదారుడ్ని విచారించిన పోలీసులు
- విచారణలో పోలీసులు తనను కొట్టారని జగన్ కు చెప్పుకున్న పవన్
- అదే డీఎస్సీ, అదే సీఐతో నీకు సెల్యూట్ కొట్టిస్తానన్న జగన్
- జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన వర్ల రామయ్య
జగన్ వ్యాఖ్యలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. జగన్ గారూ... ఓ కేసులో ముద్దాయిగా ఉన్న పవన్ అనే వ్యక్తిని పోలీసులు విచారిస్తే... మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీఐ, డీఎస్పీతో ముద్దాయికి సెల్యూట్ కొట్టిస్తాననడం తగునా? అని ప్రశ్నించారు. ఐదేళ్లు సీఎంగా రాష్ట్రానికి ఇలాగే చేశారా? పోలీసులను బ్లాక్ మెయిల్ చేస్తారా? అసాంఘిక శక్తిలా మాట్లాడతారా? అని వర్ల రామయ్య నిలదీశారు.