ఉప్ప‌ల్ స్టేడియంలో త‌మ‌న్ మ్యూజిక‌ల్ ఈవెంట్‌.. ఎప్పుడంటే..!

  • ఉప్ప‌ల్‌లో ఎల్లుండి ఎల్ఎస్‌జీతో ఎస్ఆర్‌హెచ్ ఢీ
  • మ్యాచ్ ప్రారంభానికి ముందు త‌మ‌న్ ఆధ్వ‌ర్యంలో మ్యూజిక‌ల్ ఈవెంట్ 
  • త‌న సంగీత కార్య‌క్ర‌మంతో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నున్న మ్యూజిక్ డైరెక్ట‌ర్
గురువారం నాడు ఉప్ప‌ల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) త‌ల‌ప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లే ప్రేక్ష‌కుల‌కు గుడ్‌న్యూస్‌. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్ నేతృత్వంలో మ్యూజిక‌ల్ ఈవెంట్ ఉండ‌నుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్ త‌న సంగీత కార్య‌క్ర‌మంతో ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌నున్నారు. 

ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విష‌యాన్ని ప్రకటించింది. కాగా, ఈసారి దేశ‌వ్యాప్తంగా ఐపీఎల్ జ‌రుగుతున్న ప‌లు స్టేడియాల్లో మ్యాచ్‌కు ఇదే త‌ర‌హాలో మ్యూజిక‌ల్ ఈవెంట్స్‌ను బీసీసీఐ నిర్వ‌హిస్తోంది. ఇదిలాఉంటే... ఐపీఎల్ 18వ సీజ‌న్‌ను గ్రాండ్ విక్ట‌రీతో ఎస్ఆర్‌హెచ్ శుభారంభం చేసింది. ఆదివారం నాడు (మార్చి 23న‌) రాజ‌స్థాన్ రాయ‌ల్స్ (ఆర్ఆర్‌)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 44 ప‌రుగుల‌తో విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.


More Telugu News