'జాక్' నుంచి 'కిస్' లిరిక‌ల్ సాంగ్ వ‌చ్చేసింది!

Jack Movies Kiss Lyrical Song Released
  • సిద్ధూ జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ‘జాక్’
  • వైష్ణవి చైతన్య హీరోయిన్.. బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మాత‌
  • భాగ్యనగరం అంతా.. అంటూ కిస్‌ కోసం సాగిన పాట‌
  • సనారే రాయగా జావేద్ అలీ, అమల చేబోలు గాత్రం
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వ‌స్తున్న తాజా చిత్రం ‘జాక్’. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. ఎస్‌వీసీసీ బ్యానర్‌పై బీవీఎస్ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ  సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ఓ పాట విడుద‌ల‌య్యాయి. తాజాగా కిస్ అంటూ సాగే మరో పాటను మేకర్స్ విడుదల చేశారు.

భాగ్యనగరం అంతా.. అంటూ ముద్దు కోసం సాగిన ఈ పాట‌ను సనారే రాయగా జావేద్ అలీ, అమల చేబోలు ఆల‌పించారు. సురేష్ బొబ్బిలి బాణీలు అందించారు. కాగా, ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.



Go Back to Shorts
Jack Movie
Siddu Jonnalagadda
Vaishnavi Chaitanya
Kiss lyrical song
Bommarillu Bhaskar
Telugu Cinema
Suresh Bobbili
new song release
Tollywood

More Telugu News