భ‌ర్త‌పై కోపంతో ట‌వ‌ర్ ఎక్కిన భార్య‌.. రిస్క్ చేసి కాపాడిన పోలీస్‌.. ఇదిగో వీడియో!

  • యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో ఘ‌ట‌న
  • దంప‌తుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
  • మ‌న‌స్తాపంతో ఎల‌క్ట్రిక్ ట‌వ‌ర్ ఎక్కి భార్య‌ ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
  • సాహ‌సం చేసి ఆమెను కాపాడిన పోలీస్‌పై ప్ర‌శంస‌లు
యూపీలోని ప్ర‌యాగ్‌రాజ్‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ భ‌ర్త‌పై కోపంతో విద్యుత్ ట‌వ‌ర్ ఎక్కింది. దాంతో ఓ పోలీస్ రిస్క్ చేసి ఆమెను కాపాడారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. సాహ‌సం చేసి మ‌హిళ‌ను కాపాడిన పోలీసుపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే... స్థానికంగా ఉండే ఓ మహిళ‌కు త‌న భ‌ర్త‌తో గొడ‌వ జ‌రిగింది. దాంతో మ‌న‌స్తాపం చెందిన ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవాలనే ఆలోచనతో పొలాల్లో ఉన్న ఎల‌క్ట్రిక్ ట‌వ‌ర్ ఎక్కేసింది. అది గ‌మ‌నించిన గ్రామ‌స్థులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. వారి స‌మాచారంతో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు మ‌హిళ‌కు న‌చ్చజెప్పి కింద‌కు దించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, ఆమె పోలీసుల మాట విన‌లేదు. దాంతో చేసేదేమీలేక ఓ పోలీస్ ఆమెను ర‌క్షించేందుకు రిస్క్ చేయాల్సి వ‌చ్చింది. 

ఆమెను కాపాడేందుకు వేగంగా ట‌వ‌ర్ ఎక్కాడు. మ‌హిళ వ‌ద్ద‌కు చేరుకుని, నెమ్మ‌దిగా ఆమెను కింద‌కు దించాడు. అనంత‌రం పోలీసులు దంప‌తుల‌కు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు.  




More Telugu News