ఢిల్లీ వీధుల్లో న్యూజిలాండ్‌ ప్ర‌ధాని గ‌ల్లీ క్రికెట్‌.. ఇవిగో ఫొటోలు!

  
న్యూజిలాండ్ ప్ర‌ధాని క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్ ప్రస్తుతం భార‌త్‌లో ప‌ర్య‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా దేశ రాజ‌ధాని ఢిల్లీ వీధుల్లో అక్క‌డి పిల్ల‌ల‌తో క‌లిసి క్రికెట్ ఆడుతూ స‌ర‌దాగా గ‌డిపారు. ఆయ‌న‌తో పాటు కివీస్ మాజీ క్రికెట‌ర్ రాస్ టేల‌ర్ కూడా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా ఇరు దేశాల‌ను ఏకం చేయ‌డంలో క్రికెట్‌ను మించిన‌ది లేదంటూ క్రిస్టోఫ‌ర్ ల‌క్స‌న్‌ ట్వీట్ చేశారు. తాను క్రికెట్ ఆడిన ఫొటోల‌ను పంచుకున్నారు.


More Telugu News