ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య
- అసెంబ్లీ ప్రాంగణంలో సీఎంను కలిసిన గుమ్మడి నర్సయ్య
- మాజీ ఎమ్మెల్యేని ఆప్యాయంగా పలకరించిన సీఎం
- సీఎంను కలిసేందుకు అవకాశమివ్వడం లేదంటూ ఇటీవల నర్సయ్య ఆవేదన
ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం లభించడం లేదంటూ సుమారు పదిహేను రోజుల క్రితం గుమ్మడి నర్సయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కలవడానికి పలుమార్లు వెళ్లినప్పటికీ గేటు వద్దే ఆపేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ లభించడంతో ఈరోజు ఆయనను కలిశారు.