వైవీ సుబ్బారెడ్డి తల్లి పార్థివదేహానికి నివాళి అర్పించిన జగన్... ఫొటోలు ఇవిగో!
- నిన్న తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన సుబ్బారెడ్డి మాతృమూర్తి
- మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి వెళ్లిన జగన్
- సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చిన జగన్
బాపట్ల జిల్లా మేదరమెట్లలోని సుబ్బారెడ్డి నివాసానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె భౌతికకాయానికి నివాళి అర్పించి, వైవీ కుటుంబ సభ్యులను జగన్ ఓదార్చారు. ఈ సందర్భంగా జగన్ తో పాటు ఆయన తల్లి విజయమ్మ కూడా ఉన్నారు. సుబ్బారెడ్డి తల్లి అంత్యక్రియల్లో జగన్ పాల్గొనబోతున్నారు.

