తెలంగాణలో రోప్ వే పర్యాటకం.. భువనగిరి కోట.. యాదగిరిగుట్టపై నిర్మాణం
- స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద ఐదు ప్రాంతాల్లో రోప్ వేలు
- భువనగిరి కోటలో రోప్ వే ఏర్పాటుకు రూ. 56.81 కోట్లతో టెండర్లు
- రోప్ వే ఏర్పాటుతో పర్యాటకులకు సరికొత్త అనుభూతి
- యాదగిరి గుట్టపై 2 కి.మీ. మేర రోప్ వే
భువనగిరి కోటతోపాటు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి, నల్గొండలోని హనుమాన్ కొండ, నాగార్జునసాగర్ ఆనకట్ట, మంథనిలోని రామగిరి కోట వరకు కూడా రోప్ వే ఏర్పాటు చేస్తారు. నాగార్జునసాగర్ ఆనకట్ట మీదుగా 5 కిలోమీటర్ల మేర రోప్ వే నిర్మించనుండగా మిగతావన్నీ 2 కిలోమీటర్ల మేర ఉన్నాయి.
భువనగిరి కోట ప్రాజెక్టులో భాగంగా రోప్ వే కోసం రూ. 15.20 కోట్లు ఖర్చు చేయనుండగా 30 మీటర్ల వెడల్పుతో యాక్సెస్ రోడ్డు, పార్కింగ్ వంటి నిర్మాణాల కోసం రూ. 10.73 కోట్లు, ప్రవేశద్వారం, టూరిజం సదుపాయాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు రూ. 10.37 కోట్లు, ఇతర ఏర్పాట్లకు రూ. 11.11 కోట్లు ఖర్చు చేస్తారు.