రేపు వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం... సీఎం చంద్రబాబును ఆహ్వానించిన బీఆర్ నాయుడు
- అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీనివాస కల్యాణం
- సీఎం చంద్రబాబుకు ఆహ్వాన పత్రిక అందించిన బీఆర్ నాయుడు
- భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న చంద్రబాబు
వెంకటపాలెంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణం ఏర్పాట్ల గురించి బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడుకు, టీటీడీ బోర్డు సభ్యులకు సూచించారు.
కాగా, చంద్రబాబును కలిసిన వారిలో టీటీడీ పాలకమండలి సభ్యులు, టీటీడీ ఈవో, జేఈవో కూడా ఉన్నారు.
