Telangana: ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్

TG budget to be tabled on March 19

  • బీఏసీ సమావేశంలో నిర్ణయం
  • రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
  • ఈ నెల 27వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు

ఈ నెల 19వ తేదీన తెలంగాణ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉండనుంది.

ఈ నెల 14వ తేదీన హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవును ప్రకటించారు. ఈ నెల 27వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 17, 18 తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 21 నుంచి 26వ తేదీ వరకు వివిధ పద్దులపై చర్చ చేపట్టనున్నారు.

  • Loading...

More Telugu News