Ranya Rao: విచారణ పేరుతో రన్యా రావును నిద్రపోనివ్వడం లేదు: కోర్టుకు తెలిపిన న్యాయవాది

- రన్యా రావు బెయిల్ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో వాదనలు
- అరెస్టు సమయంలో రన్యా రావుకు తన హక్కుల గురించి తెలియదన్న న్యాయవాది
- అరెస్టు సమయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగాయన్న న్యాయవాది
విచారణ పేరుతో రన్యా రావును డీఆర్ఐ అధికారులు సరిగా నిద్రపోనివ్వడం లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె తరఫు న్యాయవాది కీలక విషయాలను వెల్లడించారు.
రన్యా రావు అరెస్టయిన సమయంలో తన హక్కుల గురించి ఆమెకు పూర్తిగా తెలియదని ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. విమానాశ్రయం వద్ద ఆమెను అదుపులోకి తీసుకునే సమయంలో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరిగినట్లు కోర్టుకు తెలిపారు. రన్యా రావు స్వతహాగా వాంగ్మూలం ఇవ్వలేదన్నారు. విచారణ పేరుతో సరిగా నిద్ర కూడా పోనివ్వడం లేదని పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.