అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఇద్దరి మృతి, 40 మందికి తీవ్ర గాయాలు
- రాయల్పాడు సమీపంలో రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ఢీ
- క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించిన పోలీసులు
- ఐదుగురి పరిస్థితి విషమం
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.