BEd Paper Leak: ఏఎన్ యూ బీఎడ్ ప్రశ్నాపత్నం లీక్... పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు

Police probe starts in ANU BEd Paper Leak Case
  • నిన్న బీఎడ్ మొదటి సెమిస్టర్ ప్రశ్నాపత్రం లీక్
  • వెంటనే పరీక్షను రద్దు చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్
  • కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
  • ముగ్గురు నిందితులు ఒడిశాకు చెందినవారిగా గుర్తింపు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో నిర్వహిస్తున్న బీఎడ్ మొదటి సెమిస్టర్ పరీక్షల్లో నిన్న ప్రశ్నాపత్రం లీక్ కావడం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్ మెంట్పరీక్ష జరగాల్సి ఉండగా... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందే పేపర్ బయటికొచ్చింది. దీనిపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించి, పరీక్షను రద్దు చేశారు. 

కాగా, ఈ పేపర్ లీక్ వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పేపర్ లీక్ తో సంబంధం ఉందని భావిస్తున్న ముగ్గురు నిందితులును అదుపులోకి తీసుకున్నారు. వీరు ముగ్గురు ఒడిశాకు చెందినవారిగా గుర్తించారు.
BEd Paper Leak
ANU
Police

More Telugu News