విజయవాడ భవానీపురం పీఎస్ కు పోసాని తరలింపు
- నటుడు పోసానిపై ఏపీలో 17 వరకు కేసులు!
- చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు
- పోలీస్ స్టేషన్లకు, జైళ్లకు, కోర్టులకు తిరుగుతున్న పోసాని!
తాజాగా, పోసాని కృష్ణమురళిని విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనను పీటీ వారెంట్ పై విజయవాడ తీసుకువస్తున్నారు. ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపర్చనున్నారు. కోర్టు రిమాండ్ విధించిన అనంతరం ఆయనను మళ్లీ కర్నూలు జిల్లా జైలుకు తరలించనున్నారు.