Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టాటా పవర్ అనుబంధ సంస్థ, ఏపీ ప్రభుత్వం మధ్య ఎంవోయూ

AP Govt inked MoU with TPREL
షార్ట్స్‌లో చూడండి
టాటా పవర్ అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి సహకారం, కొత్త అవకాశాలను అన్వేషణకు ఏపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ( MOU ) కుదుర్చుకుంది. 

నేడు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా సుమారు రూ.49 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు రానున్నాయి. 

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ... రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు ట్రాన్సఫార్మేషన్ ను వేగవంతం చేయాలన్న సీఎం చంద్రబాబు నాయుడు విజన్ కు అనుగుణంగా ఈ ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు.

టాటా రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ దీపేష్ నందా మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. 

ఈ కార్యక్రమంలో టాటా రెన్యూవబుల్ ఎనర్జీ సీఎఫ్ఓ అమిత్ మిమానీ, గ్రూప్ హెడ్ (ప్లానింగ్ రెన్యువబుల్స్) తాహేర్ లోకానంద్ వాలా, లీడ్ (స్ట్రాటజీ) గరిమా చౌదరి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్, NREDCAP ఎండీ కమలాకర్ బాబు, జనరల్ మేనేజర్ (విండ్ & సోలార్) కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.
Go Back to Shorts
Nara Lokesh
AP Govt
Tata Power
TPREL
MoU
Andhra Pradesh

More Telugu News