గాయని కల్పన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల మీడియా సమావేశం
- కల్పన వేగంగా కోలుకుంటున్నారన్న హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు
- కల్పన అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడి
- కల్పనను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారన్న వైద్యులు
కల్పనను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. ఇక్కడకు తీసుకువచ్చినప్పుడు ఆమె స్పృహలో లేరని, వెంటనే చికిత్స అందించడం వల్ల ఆమె వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు తొలగించినట్లు తెలిపారు. శ్వాస తీసుకోగలుగుతున్నారని, భోజనం కూడా తీసుకుంటున్నారని వివరించారు.