కొడాలి నాని రూ. 500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు... తక్షణమే విచారణ జరిపించి, కఠిన చర్యలు తీసుకోవాలి: వెనిగండ్ల రాము

  • కొడాలి నాని పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం దోచేశారన్న వెనిగండ్ల
  • మంత్రిగా ఉన్నప్పుడు భారీ స్కామ్ చేశారని ఆరోపణ
  • కరోనా సమయంలో కేంద్రం పేదలకు ఇచ్చిన బియ్యం బొక్కేశారన్న గుడివాడ ఎమ్మెల్యే
మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పేదలకు అందాల్సిన బియ్యం బొక్కేశారని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. రూ. 500 కోట్ల మేర భారీ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తక్షణమే కొడాలి నానిపై విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు ప్రభుత్వాన్ని కోరారు.

కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు అప్పటి జేసీ అండతో భారీ స్కామ్ చేశారని వెనిగండ్ల తెలిపారు. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందించిన రేషన్ బియ్యం దోచేశారని ఆరోపించారు. గుడివాడలో 40 వేల రేషన్ కార్డులు ఉండగా... కేవలం 12 వేల కార్డులకు మాత్రమే బియ్యం సరఫరా చేసి మిగిలిన బియ్యం దోచేశారని చెప్పారు. 

కేవలం గుడివాడలోనే ఈ మేరకు అవినీతికి పాల్పడితే... మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు అవినీతికి పాల్పడ్డారో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కొడాలి నాని అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేయాలని కోరారు. ఆయనకు సహకరించిన అధికారులు, రైసు మిల్లర్లపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.


More Telugu News