వైఎస్ వివేకా వాచ్ మన్ రంగన్న భార్య కీలక వ్యాఖ్యలు
- వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న
- అనారోగ్య సమస్యలతో తన భర్త బాధపడేవారన్న రంగన్న భార్య
- ఊపిరితిత్తుల సమస్యతో ఆయన చనిపోయారని వెల్లడి
ఈ సందర్భంగా రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య సమస్యలతో తన భర్త బాధపడేవారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమను బాగా చూసుకున్నారని... రూ. 3 వేల పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు. గత మూడు నెలల నుంచి తన భర్త మానసికంగా దెబ్బతిన్నారని చెప్పారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధితోనే ఆయన చనిపోయారని చెప్పారు.