వైఎస్ వివేకా వాచ్ మన్ రంగన్న భార్య కీలక వ్యాఖ్యలు

  • వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న రంగన్న
  • అనారోగ్య సమస్యలతో తన భర్త బాధపడేవారన్న రంగన్న భార్య
  • ఊపిరితిత్తుల సమస్యతో ఆయన చనిపోయారని వెల్లడి
మాజీ మంత్రి వైఎస్ వివేకా ఇంటిలో గతంలో వాచ్ మన్ గా పని చేసిన రంగన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను కుటుంబ సభ్యులు పులివెందుల ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. పరిస్థితి మరింత విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వివేకా హత్య కేసులో రంగన్న ప్రధాన సాక్షిగా ఉన్నారు. హంతకులను రంగన్న గుర్తించడంతో ఈ కేసులో సీబీఐ విచారణ మొదలైంది. 

ఈ సందర్భంగా రంగన్న భార్య సుశీలమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అనారోగ్య సమస్యలతో తన భర్త బాధపడేవారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమను బాగా చూసుకున్నారని... రూ. 3 వేల పెన్షన్ కూడా ఇచ్చేవారని తెలిపారు. గత మూడు నెలల నుంచి తన భర్త మానసికంగా దెబ్బతిన్నారని చెప్పారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారని తెలిపారు. ఊపిరితిత్తుల వ్యాధితోనే ఆయన చనిపోయారని చెప్పారు.

YS Vivekananda Reddy
Ranganna

More Telugu News