మల్లన్న లేవనెత్తిన అంశాలపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి: కాంగ్రెస్ నేత మధుయాష్కీ
- రాహుల్ గాంధీ ఆదేశాలతో కులగణన జరిగిందన్న మధుయాష్కీ
- కొందరు నాయకులు సర్వేను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపణ
- పార్టీ గీత దాటితే అందర్నీ ఒకేలా చూడాలన్న మధుయాష్కీ
పార్టీలో అందరూ సమానమేనని, హద్దు మీరితే ఎవరైనా సరే చర్యలు తీసుకోవడం సహజమేనని అన్నారు. పార్టీ గీత దాటితే చర్యలు తప్పవని, కానీ అధిష్ఠానం అందరినీ ఒకేలా చూడాలని సూచించారు. తీన్మార్ మల్లన్న హద్దులు దాటారని, అది ఆయన అహంకారానికి నిదర్శనమని మధుయాష్కీ అన్నారు. రేవంత్ రెడ్డి, మల్లన్న స్నేహితులని, వారిరువురు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.