Road Accident: డేంజర్ స్పాట్... 48 గంటల్లో ఒకే చోట రెండు యాక్సిడెంట్లు...వీడియోలు ఇవిగో!

Two accidents in same spot in 48 hours
షార్ట్స్‌లో చూడండి
మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవే మీద ఒకే స్పాట్ లో 48 గంటల వ్యవధిలో రెండు ప్రమాదాలు జరగడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తొలుత ఓ బైకును తప్పించే ప్రయత్నంలో బస్సు బోల్తా పడగా... సరిగ్గా అదే ప్లేస్ లో బైకును ఓ కారు ఢీకొట్టింది. బైకుపై ఉన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 

వివరాల్లోకెళితే... మొన్న సడన్ గా అడ్డొచ్చిన బైకును తప్పించే ప్రయత్నంలో ఆర్టీసీ బస్సు నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. ఈ ఘటనలో 36 మంది గాయపడగా... ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

తాజాగా, అదే స్పాట్ లో బైకు అడ్డం రాగా... కారు వచ్చి గుద్దేసింది. కారు డ్రైవర్ బైకును తప్పించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ప్రమాద తీవ్రతకు బైకు ఓ వైపు పడిపోతే, బైకుపై ఉన్న వ్యక్తి మరోవైపు పడిపోయాడు. కారు డివైడర్ ఎక్కేసింది. 

ఈ రెండు యాక్సిడెంట్లలోనూ బైక్ అడ్డం రావడం కామన్ పాయింట్ గా కనిపిస్తోంది. వీడియోలు చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. మొదటి ప్రమాదంలో బైకర్ తప్పించుకోగా, రెండో ప్రమాదంలో బైకర్ కు తీవ్ర గాయాలయ్యాయి.
Go Back to Shorts
Road Accident
Lathur-Nanded Highway
Maharashtra

More Telugu News