బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకలా మాట్లాడుతున్నారు: తీన్మార్ మల్లన్నపై మంత్రి సీతక్క విమర్శలు
- కులగణనపై అభ్యంతరాలు ఉంటే మండలిలో మాట్లాడవచ్చన్న సీతక్క
- బీఆర్ఎస్ చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినందుకు అభినందించాలని వ్యాఖ్య
- కులగణనకు 50 రోజుల సమయమిచ్చాన్న మంత్రి
కులగణనపై అభ్యంతరాలు ఉండి ఉంటే శాసనమండలిలో మాట్లాడవచ్చని సూచించారు. బీఆర్ఎస్ చేయలేనిది తమ ప్రభుత్వం చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శించడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమతో అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. కులగణనకు 50 రోజుల సమయం ఇచ్చామని తెలిపారు.