RC16: 'ఆర్‌సీ 16' కోసం శివ రాజ్‌కుమార్ లుక్ టెస్ట్ పూర్తి.. త్వరలో సెట్స్‌లోకి ఎంట్రీ

Shiva Rajkumar Will Soon Join the Sets of RC16 and Begin Shooting for His Role
షార్ట్స్‌లో చూడండి
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్ర‌ముఖ‌ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేష‌న్‌లో 'ఆర్‌సీ 16' (వర్కింగ్ టైటిల్) మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో 'కరుణడ చక్రవర్తి' శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటించనున్నారు. ఇటీవలే చిత్రబృందం శివన్న లుక్‌ టెస్ట్‌ని పూర్తి చేసింది. ఇక త్వరలోనే ఆయ‌న‌ షూటింగ్‌లో జాయిన్‌ కానున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌ ఉండే శివ రాజ్ కుమార్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. 

ఆర్‌సీ 16 షూటింగ్ గతేడాది నవంబర్‌లో మైసూర్‌లో ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఇక ఈ మధ్యే టీం హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసింది. ఈ మూవీలో జగపతి బాబు, బాలీవుడ్ నటుడు 'మీర్జాపూర్' ఫేమ్ దివ్యేందు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు డీఓపీగా పని చేస్తున్నారు. అవినాశ్‌ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Go Back to Shorts
RC16
Shiva Rajkumar
Ramcharan
Buchi Babu Sana
Tollywood

More Telugu News