vijay devarakonda: విజయ్‌ దేవరకొండ సినిమా టైటిల్‌ను లీక్‌ చేసిన 'దిల్‌' రాజు

Vijay Deverakondas movie title leaked by Dil Raju
షార్ట్స్‌లో చూడండి
గత కొంతకాలంగా సరైన కమర్షియల్ హిట్ కోసం వేచి చూస్తున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఆయన నటించిన లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చవిచూశాయి. ప్రస్తుతం ఈ క్రేజీ హీరో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'కింగ్‌డమ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. మే 30న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంతో పాటు విజయ్ దేవరకొండ రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఓ హిస్టారికల్ పీరియాడిక్ డ్రామా చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలతో పాటు 'రాజు వారు... రాణి గారు' చిత్ర దర్శకుడు రవికిరణ్ కొల్లా దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని అంగీకరించాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని 'దిల్' రాజు నిర్మిస్తారు. 

కాగా బుధవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత రాజు ఈ చిత్రం టైటిల్‌ను లీక్ చేశాడు. తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెబుతూ ఆ వరుసలోనే విజయ్ దేవరకొండ చిత్రానికి 'రౌడీ జనార్దన్' అనే టైటిల్‌ను నిర్ణయించినట్లుగా ప్రకటించారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుందని, దీంతో పాటు నితిన్ హీరోగా 'బలగం' వేణు దర్శకత్వంలో 'ఎల్లమ్మ' అనే చిత్రాన్ని తమ సంస్థలో నిర్మిస్తున్నట్లుగా ఆయన తెలియజేశారు. 
Go Back to Shorts
vijay devarakonda
vijay devarakonda latest movie title
Rowdy janardhana
Dil raju
Ravikiran kolla
Vijay devarakonda latest news
Kingdom news
Tollywood

More Telugu News