vizag Light House: దశాబ్దాల చరిత్ర ఉన్న విశాఖ లైట్ హౌస్ ను కూల్చేస్తారా?

Will the decades old Visakha Light House be demolished
  • 1902లో విశాఖ లైట్ హౌస్ నిర్మాణం
  • 1962లో సేవలకు దూరమైన లైట్ హౌస్
  • ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్న వైనం
విశాఖ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది లైట్ హాస్. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఈ లైట్ హౌస్ ఎనలేని సేవలను అందించింది. 1903లో లైట్ హౌస్ ను నిర్మించారు. 1962లో అది సేవలకు దూరమయింది. విదేశాల నుంచి వచ్చే నౌకలు విశాఖ తీరానికి చేరుకునేలా ఈ లైట్ హౌస్ ను నిర్మించారు. సముద్రంలో 12 మైళ్ల దూరంలోని నౌకలకు కనిపించేలా ప్రతి 2 నిమిషాలకు ఒకసారి వెలుగులను విరజిమ్మేది. 

దీనికి గతంలో పలుమార్లు మరమ్మతులు చేశారు. లైట్ హౌస్ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీన్ని కూల్చేస్తారనే ప్రచారం జరుగుతోంది. విశాఖ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్న లైట్ హౌస్ ను పరిరక్షించాలని నగరవాసులు కోరుతున్నారు.
vizag Light House

More Telugu News