'తల్లికి వందనం' పథకంపై త్వరలోనే గైడ్ లైన్స్: మంత్రి లోకేశ్‌

  • 'తల్లికి వందనం' పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామ‌న్న మంత్రి
  • పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం
  • ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు వెల్ల‌డి
కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని త్వరలోనే అమలుచేయనుందని, ఇందుకు సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే ప్రకటిస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు. తల్లికి వందనం పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ పథకానికి బడ్జెట్ 2025-26లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. 

ఇక మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ బదులిచ్చారు. 'తల్లికి వందనం' సహా అన్ని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామన్న లోకేశ్‌.. నిరుద్యోగ భృతిపై సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంపై గత వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని దుయ్య‌బ‌ట్టారు. 

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమ‌ర్శించారు. చంద్రబాబు నేతృత్వంలో గత టీడీపీ హయాంలో 1.82 లక్షల టీచ‌ర్‌ పోస్టులు భర్తీ చేసిన‌ట్లు ఈ సంద‌ర్భంగా ఆయ‌న గుర్తు చేశారు. అలాగే ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి తీరుతామని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. 


More Telugu News