తీవ్ర‌మైన బాధ‌తో కెప్టెన్‌గా దిగిపోతున్నా... జాస్ బ‌ట్ల‌ర్ భావోద్వేగ పోస్ట్‌!

  • ఇటీవ‌ల ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టుకు వ‌న్డేలు, టీ20ల్లో వ‌రుస ఓట‌ములు
  • ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ ఇంగ్లండ్‌ది అదే ప‌రిస్థితి
  • ఈ వ‌రుస ఓట‌ముల‌కు బాధ్య‌త వ‌హిస్తూ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన బ‌ట్ల‌ర్‌
  • ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టా వేదిక‌గా ఎమోష‌న‌ల్ పోస్టు
ఇటీవ‌ల ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టుకు వ‌న్డేలు, టీ20ల్లో వ‌రుస ఓట‌ములు ప‌ల‌క‌రించిన విష‌యం తెలిసిందే. ఈ వ‌రుస ఓట‌ముల‌కు బాధ్య‌త వ‌హిస్తూ ఇంగ్లీష్ జ‌ట్టు సారథి జోస్ బ‌ట్ల‌ర్ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పారు. ఈ నేప‌థ్యంలో ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా తాజాగా ఒక భావోద్వేగ పోస్టు పెట్టాడు. తీవ్ర‌మైన బాధ‌తో నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకుంటున్నాన‌ని బ‌ట్ల‌ర్ ఎమోష‌న‌ల్ అయ్యాడు.

"ఇంగ్లండ్‌ వైట్ బాల్ కెప్టెన్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నందుకు చాలా బాధగా ఉంది. దేశానికి సార‌థ్యం వ‌హించ‌డం నాకు లభించిన గొప్ప గౌరవం. దీనికి నేను ఎల్లప్పుడూ గర్వపడతాను. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇది సరైన సమయం. నేను కెప్టెన్‌గా ఉన్న స‌మ‌యంలో నాకు మద్దతు ఇచ్చిన ఆటగాళ్లు, సిబ్బంది, ఇంగ్లండ్‌ అభిమానులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా నా భార్య లూయిస్, నా కుటుంబానికి థ్యాంక్స్‌. వారే నా ఎత్తుపల్లాలతో కూడిన ఈ జ‌ర్నీకి అస‌లైన స్తంభాలు" అని బ‌ట్ల‌ర్ త‌న ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. 

ఇక ఇంగ్లండ్ జ‌ట్టు ఇటీవ‌ల భార‌త్‌తో జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన విష‌యం తెలిసిందే. అలాగే ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ ఛాంపియ‌న్స్ ట్రోఫీలోనూ ఆడిన మూడు మ్యాచ్‌ల‌లో కూడా ఓట‌మి పాలైంది. దీంతో సెమీస్ చేర‌కుండానే ఇంటిదారి ప‌ట్టింది. 


More Telugu News