దిగువ కోర్టుల తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
- అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుబట్టిన సుప్రీంకోర్టు
- ఒక వ్యక్తి విడుదలైన తర్వాత బెయిల్ దరఖాస్తుకు విలువ ఉండదు
- న్యాయస్థానాలు పరిధులు దాటుతున్నాయంటూ కీలక వ్యాఖ్య
ఈ కేసులో ప్రతివాదిని జిల్లా కోర్టు విడుదల చేసిన తర్వాత ఆ విషయం తెలిసి కూడా హైకోర్టు అతని పెండింగ్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపిందని, ఒకసారి వ్యక్తి విడుదలైన తర్వాత బెయిల్ దరఖాస్తుకు విలువ లేదని పేర్కొంది. దాన్ని కొట్టివేయాలని, కోర్టు జోక్యం చేసుకొని అందులో తప్పొప్పులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయకూడదని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం పేర్కొంది.