Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పోసాని ఆరోగ్య పరిస్థితిపై పూనమ్ కౌర్ స్పందన

Poonam Kaur responds on Posani health condition
Advertisement
  • పోసానికి అస్వస్థత
  • ఏపీలో పరిస్థితులు బాగా లేవన్న పూనమ్ కౌర్
  • పోసాని ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని వెల్లడి 
Advertisement
సినీ పరిశ్రమంలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి ఆరోపణలతో అరెస్టయిన నటుడు పోసాని కృష్ణ మురళికి అస్వస్థత అంటూ వార్తలు రావడం తెలిసిందే. పోసానిని పోలీసులు ఆసుపత్రికి తీసుకెళ్లి అన్ని పరీక్షలు చేయించడం, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, డ్రామా ఆడినట్టు అర్థమైందని రైల్వే కోడూరు సీఐ మీడియాకు చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఈ పరిణామాలపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ స్పందించింది. ఏపీలో రాజకీయ పరిస్థితులు దారుణంగా మారాయని, ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో పరిస్థితులు బాగాలేవని వ్యాఖ్యానించారు. సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య పరిస్థితి తనకు ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. బలహీనులను అరెస్ట్ చేసి తీసుకెళ్లడం పగ తీర్చుకోవడమేనని విమర్శించారు. 

గతంలో పవన్ కల్యాణ్ ను విమర్శించే సమయంలో పోసాని పరోక్షంగా పూనమ్ కౌర్ గురించి పలుమార్లు ప్రస్తావించారు. ఆ సమయంలో పోసాని మాటలతో తాను బాధపడినప్పటికీ, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పూనమ్ పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Poonam Kaur
Posani Krishna Murali
Pawan Kalyan
Andhra Pradesh

More Telugu News