యాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
- నేటి నుండి మార్చి 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు
- ఆలయ గోపురానికి బంగారు తాపడం అనంతరం మొదటి బ్రహ్మోత్సవాలు
- గర్భాలయంలోని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు
మొదటిరోజు శ్రీ విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం పూజలు, వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదట గర్భాలయంలోని స్వయంభు నారసింహస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.