హైదరాబాద్కు మూడువైపులా ఇసుక స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేయాలి: రేవంత్ రెడ్డి
- ఇసుక, ఖనిజాల అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
- ప్రభుత్వమే సరైన ధరలకు ఇసుకను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి
- క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచన
నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీయే సరఫరా చేయాలన్నారు. ప్రభుత్వమే సరైన ధరలకు ఇసుకను సరఫరా చేస్తే అక్రమాలకు ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. క్వారీలకు జరిమానాలపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మైనర్ ఖనిజాల బ్లాకుల వేలానికి వెంటనే టెండర్లను పిలవాలని ఆయన సూచించారు.