ఇంకా జనాల వద్ద రూ.2 వేలు కరెన్సీ నోట్లు... ఆర్బీఐ నివేదికలో ఆసక్తికర అంశాలు
- గతంలో రూ.2 వేల నోటు తీసుకువచ్చిన కేంద్రం
- కొంత కాలానికి మార్కెట్ నుంచి ఉపసంహరణ
- ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువ చేసే రూ.2 వేలు నోట్లు
కాగా, బ్యాంకులద్వారా రూ.2 వేలు నోట్లను మార్చుకునే వెసులుబాటు 2023 అక్టోబరు 7వ తేదీతో ముగిసింది. ఆ తర్వాత ఆర్బీఐ రీజినల్ ఆఫీసుల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికీ ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల వద్ద నోట్ల మార్పిడికి, డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉందని... తమ కార్యాలయాల వద్దకు రాలేని వారు పోస్టల్ శాఖ ద్వారా కూడా నోట్లను పంపవచ్చని ఆర్బీఐ వెల్లడించింది.