125 ఏళ్లలో ఈ ఏడాది ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం: హైదరాబాద్ వాతావరణ కేంద్రం

  • మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండవచ్చునని వెల్లడి
  • దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసరాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వెల్లడి
  • దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశముందన్న వాతావరణ కేంద్రం
1901 నుండి 2025 వరకు సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండ తీవ్రత సాధారణం కంటే అధికంగా ఉంటుందని, వడగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని తెలిపింది.

ఏప్రిల్, మే నెల వచ్చేసరికి 44 నుండి 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 1901 నుండి సరాసరి సగటు తీసుకుంటే ఈ ఏడాది ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా దక్షిణ, మధ్య తెలంగాణతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

దక్షిణ, ఉత్తర తెలంగాణలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీలు పెరిగే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. 125 సంవత్సరాల సరాసరి తీసుకుంటే గాలిలో తేమ తీవ్రత తగ్గినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.


More Telugu News