IAS Shiva Shankar: ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఏపీకి కేటాయించండి: క్యాట్ ఆదేశాలు

CAT orders DOPT to allot IAS Official Shiva Shankar to AP
షార్ట్స్‌లో చూడండి
విభజన సమయంలో తనను తెలంగాణకు కేటాయించడం పట్ల ఐఏఎస్ అధికారి ఎల్.శివశంకర్ న్యాయపోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయనకు భారీ ఊరట కలిగింది. ఐఏఎస్ అధికారి శివశంకర్ ను ఏపీకి కేటాయించాలంటూ తాజాగా క్యాట్ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు, శివశంకర్ ను నాలుగు వారాల్లోగా ఏపీ క్యాడర్ కు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలంటూ డీవోపీటీని ఆదేశించింది. 

కొన్నాళ్ల కిందట ఐఏఎస్ అధికారి శివశంకర్ సీఎం చంద్రబాబును కలిశారు. తన సొంత రాష్ట్రం ఏపీ అని, కానీ పోస్టింగ్ సమయంలో తాత్కాలిక చిరునామా కింద హైదరాబాద్ అని పేర్కొన్నానని చంద్రబాబుకు వివరించారు. స్థానికతను పరిగణనలోకి తీసుకుని తనను ఏపీలో కొనసాగేలా చూడాలని కోరారు. 

శివశంకర్ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు... కేంద్రంతో మాట్లాడారు. ఈ క్రమంలోనే, శివశంకర్ ను ఏపీకి కేటాయించేలా చర్యలు తీసుకోవాలంటూ క్యాట్ తాజాగా డీవోపీటీకి ఆదేశాలు జారీ చేసింది.
Go Back to Shorts
IAS Shiva Shankar
CAT
DOPT
Andhra Pradesh

More Telugu News