వచ్చే ఎన్నికల్లో జేడీయూకు ఒక్క సీటూ రాదు.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
- సీఎం పదవి కోసమే నితీశ్ కుమార్ పొత్తులు పెట్టుకుంటున్నారన్న ప్రశాంత్
- పొత్తులో ఉంటే తన పార్టీకి తగినన్ని సీట్లు రాకున్నా సీఎం కావొచ్చని నితీశ్ ఆశపడుతున్నారని వ్యాఖ్య
- ఆయన శారీరకంగా అలసిపోయి, మానసికంగా రిటైరయ్యారని ఎద్దేవా
పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ నితీశ్ కుమార్ తన సీఎం పీఠాన్ని నిలబెట్టుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ విమర్శించారు. పొత్తులు పెట్టుకోవడం వల్ల జేడీయూకు తక్కువ సీట్లు వచ్చినా పదవి ఉంటుందని నితీశ్ భావిస్తున్నారని పీకే ఎద్దేవా చేశారు. నితీశ్ కుమార్ వ్యూహానికి అడ్డుకట్ట వేయాలంటే వచ్చే ఎన్నికల్లో జేడీయూకు ఒక్క సీటు కూడా ఇవ్వకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు చెప్పారు. అప్పుడు మాత్రమే శారీరకంగా అలసిపోయిన, మానసికంగా రిటైరైన ముఖ్యమంత్రి దూరం అవుతారని పేర్కొన్నారు.