సంచలనం సృష్టించిన పూణే లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్ట్
- పూణేలో అత్యంత రద్దీగా ఉండే స్వర్‌గేట్ బస్టాండ్‌లో మంగళవారం ఘటన
- యువతిని ‘అక్కా’ అని సంబోధించి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడు
- రాజకీయంగా దుమారం రేపిన ఘటన
- నిందితుడి కోసం రంగంలోకి దిగిన 8 బృందాలు
- శిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో దాక్కున్న నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
బాధిత యువతి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని 36 ఏళ్ల దత్తాత్రేయ రాందాస్‌గా గుర్తించారు. అతడిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని, 2019 నుంచి అతను బెయిలుపై ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం 8 బృందాలను రంగంలోకి దింపారు. ఈ క్రమంలో శిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో దాక్కున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.