పాకిస్థాన్ క్రికెటర్లను కోచ్ దూషించినట్లుగా వార్తలు.. ఆయన ఏం చెప్పారంటే?
- లీగ్ దశలోనే టోర్నీ నుండి నిష్క్రమించిన పాకిస్థాన్
- బ్యాట్స్‌మెన్‌పై కోచ్ పరుష పదజాలం ఉపయోగించినట్లు వార్తలు
- దూషించినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన జావెద్
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ క్రికెట్ జట్టు లీగ్ దశలోనే టోర్నీ నుండి నిష్క్రమించడంతో పాక్ జట్టుపై అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జట్టు తాత్కాలిక కోచ్ ఆకీబ్ జావెద్ పాక్ బ్యాట్స్‌మెన్‌పై పరుష పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని ఆకీబ్ జావెద్ ఖండించారు.
ఆటగాళ్లను తాను దూషించినట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, అలాంటి సంస్కృతికి తాను దూరమని ఆయన స్పష్టం చేశారు. సాధారణంగా ఉపాధ్యాయులు, కోచ్‌లు విద్యార్థులను దూషించడం, కొట్టడం సాధారణమే అయినప్పటికీ, తాను మాత్రం ఆ సంస్కృతికి దూరమని తేల్చి చెప్పారు.
తాను ఆటగాళ్లను గౌరవిస్తానని, కోచ్ అంటే ఆటగాళ్లకు అవసరమైన సహాయం చేసే వ్యక్తి అని పేర్కొన్నారు. వారి నైపుణ్యాలను మెరుగుపరచడానికి సూచనలు, సలహాలు ఇవ్వాలే తప్ప, వారిని నిందించడం సరికాదని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, కోచ్ ఆకీబ్ జావెద్ మధ్య విభేదాలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.