40 ఇయ‌ర్స్ ల‌వ్‌... క్యూట్ వీడియో షేర్ చేసిన ఉపాస‌న‌... విషెస్ తెలుపుతున్న నెటిజ‌న్లు!

   
గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అర్ధాంగి, మెగా కోడ‌లు ఉపాస‌న తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక క్యూట్ వీడియోను పోస్ట్ చేశారు. త‌న పేరెంట్స్ 40వ పెళ్లి రోజును పుర‌స్క‌రించుకుని ఆమె ఈ వీడియోను షేర్ చేశారు. 

"40 ఇయ‌ర్స్ ల‌వ్ అండ్ టుగెద‌ర్‌నెస్... వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌లు అమ్మ‌, నాన్న. మాపై మీ ఆశీర్వాదం ఎల్ల‌ప్పుడూ ఉంటుంది" అంటూ ఉపాస‌న రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన మెగా అభిమానులు, నెటిజ‌న్లు ఉపాస‌న పేరెంట్స్ కు విషెస్ తెలుపుతున్నారు.  


More Telugu News